World / Health
ఈ దగ్గు మందు డేంజర్ అట
466 days ago

దగ్గు నివారణకోసం పిల్లలు, పెద్దలు కూడా వాడే కోరెక్స్ కాఫ్ సిరప్ డేంజర్ అట. మనుషులకు ఇది హాని చేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో దీన్ని బ్యాన్ చేశారు. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ ఇండియా యూనిట్ దీన్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తోంది. ఎక్స్‌పర్టులు చేసిన సూచనతో ఈ సంస్థ ఈ సిరప్ అమ్మకాలను నిలిపివేసింది. క్లోపెనిరామైన్ మెలేట్, కోడీన్ కాంబినేషన్‌తో కూడిన కోరెక్స్‌లో దగ్గును  నివారించే ఇన్‌గ్రేడియంట్స్‌ లేవని ప్రభుత్వ నిపుణుల బృందం కనుక్కుంది.

కొన్నేళ్లుగా ఇండియాలోని మార్కెట్లలో కోరేక్స్ అమ్ముతున్నారు. అయితే దీన్ని నిషేధించాలన్న నిర్ణయం ఫైజర్ కంపెనీ ఆదాయాన్ని దెబ్బ తీయవచ్చు. గత డిసెంబరుతో అంతమైన తొమ్మిది నెలల కాలంలో ఈ సంస్థకు కోరెక్స్ సిరప్ అమ్మకాల ద్వారా సుమారు 150 కోట్లకుపైగా రెవెన్యూ వచ్చింది. కానీ తమ ఉత్పాదన సురక్షితమైనదని. 30 ఏళ్ళకు పైగా భారత్‌లో దీన్ని అమ్ముతున్నామని ఫైజర్ సంస్థ చెబుతోంది.

 

 
 
 
Related News

JournalistDiary