Telangana / Crime
బాయ్ ఫ్రెండు కోసం.. దొంగగా మారింది
299 days ago

తన బాయ్‌ఫ్రెండు డబ్బుల్లేక సతమతమవుతుంటే చూసి సహించలేకపోయింది ఓ 19 ఏళ్ళ టీనేజర్. డబ్బులకోసం దొంగతనాలకు అలవాటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సరూర్ నగర్‌లోని మారుతీ నగర్‌లో ఉంటున్న జి.సాయి కిరణ్మయి అనే యువతి.. ఓ జిమ్ ఇన్‌స్త్రక్టర్ అయిన యశ్వంత్ నాయుడితో ప్రేమలో పడింది. తరచూ సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న తన బాయ్‌ఫ్రెండును చూసి మధనపడేది. అతనికి అవసరమైన డబ్బులకోసం భలే ప్లాన్ వేసింది. ఇందుకు యశ్వంత్ కూడా సై అన్నాడు. అతని సలహాతో కిరణ్మయి ఫేస్‌బుక్‌లో తన పేరిట ఖాతా తెరిచి మహిళలు, తన ఈడు టీనేజర్లతో స్నేహం స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు వారి ఇళ్ళకు వెళ్తూ వారి అభిమానం సంపాదించింది.

గత అక్టోబరు 30న బి.రాజేశ్వరి అనే మహిళ ఇంట్లో 15 తులాల బంగారు నగలు, నవంబరు 2న సంధ్య అనే అమ్మాయి ఇంట్లో 4.5 తులాల బంగారు చైను, ఆమె డెబిట్ కార్డును కిరణ్మయి దొంగిలించింది. సంధ్య డెబిట్ కార్డుతో బ్యాంకు నుంచి 30 వేలు డ్రా చేసి తిరిగి ఏమీ తెలియనట్టు డెబిట్ కార్డును సంధ్య ఇంట్లో ఉంచేసింది. అయితే ఆ తరువాత సంధ్యకు కిరణ్మయి అసలు రూపం తెలిసి జూబిలీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిరణ్మయిని, ఆమె బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్ నాయుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరిని జుడిషియల్ రిమాండుకు పంపింది.

 

Read Also

 
Related News
JournalistDiary