AP / Entertainment
వర్ద తుపానుతో వణకుతున్న ఏపీ
248 days ago

వర్ద తుపాను అతి తీవ్ర తుపానుగా కొనసాగుతూ పశ్చిమ నైరుతి దిశగా సాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి  ఆనుకుని కొనసాగుతున్న ఈ అతి తీవ్ర తుపాను గంటకు 13 కి.మీ.వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాత్రి వర్ద తుపాను తూర్పు ఈశాన్య దిశగా చెన్నైకి 300,  నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఈ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఏపీలో నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. గంటకు 100 నుంచి 125 కి.మీ. వేగంతో అప్పుడే బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్య కారులకు హెచ్చరిస్తున్నారు.


 

Read Also

 
Related News