India / Crime
డొలాకియా డొల్లతనం
242 days ago

ప్రతి ఏడాదీ దీపావళి పండుగ బోనస్‌గా తన కంపెనీలో పని చేసే ఉద్యోగుల్లో సుమారు పదిహేను వందలమందికి కొత్త కార్లు, ఫ్లాట్లు బోనస్‌గా ఇచ్చే సూరత్‌‌లోని వజ్రాల వ్యాపారి సావ్‌జీ డొలాకియా డొల్లతనం బయటపడింది. రూ.6 వేల కోట్ల హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ అయిన ఈయన తన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముకే ఎగనామం పెట్టాడు. వారి పీఎఫ్ కోసం చెల్లించాల్సిన రూ.16.66 కోట్లను చెల్లించకుండా ఎగవేశాడు. దీంతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ) పూనుకొంది. ఆయనకునోటీసులు జారీ చేసింది. ఈ సంస్థ ఖాతాలను కూడా స్తంభింపజేయవచ్చునని భావిస్తున్నారు.

డొలాకియా సంస్థలో మొత్తం 3,165 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. కేవలం 17 మందికి  మాత్రమే పీఎఫ్ వర్తింపజేస్తున్నారు. చాలా ఏళ్ళుగా ప్రావిడెంట్ ఫండ్ చెల్లించకపోవడంతో ఈ వ్యవహారంపై రెండేళ్ళపాటు ఈపీఎఫ్ఓ విచారణ జరిపింది. 15 రోజుల్లోగా రూ.16.66 కోట్లను చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు.

 
 
Related News