AP and TS / Entertainment
తనయుడి కోసం 200 మందికి ఆడిషన్స్!
26 days ago

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన నెక్స్ట్ మూవీని తన తనయుడు ఆకాష్‌తో తీయాలని డిసైడయ్యాడని సమాచారం. ఈ చిత్రంలో ఆకాష్‌కి జోడీగా కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయబోతున్నాడట. ఇందుకోసం సుమారు 200 మంది అమ్మాయిలకు ఆడిషన్స్ నిర్వహించాక. ఓ అమ్మాయిని ఫైనల్ చేశాడని, ఆమె పేరు నేహాశెట్టి అని తెలిసింది.

ఫోటోషూట్, ట్రయల్ కూడా ఫినిష్ చేసి.. చివరకు నేహాశెట్టిని పూరీ ఖరారు చేశాడంటున్నారు. గత ఏడాది కన్నడలో ‘ముంగారు మలే’ అనే చిత్రంలో నటించిన నేహా.. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ సినిమా త్వరలో సెట్స్‌కు వెళ్ళనుందన్నది టాలీవుడ్ వర్గాల కథనం.

 

Read Also

 
Related News
JournalistDiary