AP / crime
తాగిన మైకంలో మాజీ ఎమ్మెల్యే ఏం చేశాడంటే....
111 days ago

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వర రావు గుడివాడలోని ఓ క్లబ్ లో తన రివాల్వర్ తో హల్ చల్ చేశాడు. ఆ సమయంలో ఆయన మద్యం తాగి ఉన్నట్టు తెలిసింది.  ఈయన  రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అందర్నీ భయపెట్టాడు. ఇతని వీరంగం తో క్లబ్ లోని వారంతా బయటకు పరుగులు తీశారు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.  స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని ఆ సమయంలో ఆ క్లబ్ రెండో అంతస్తులో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వెంకటేశ్వర రావు తన అనుచరులతో సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లి ఇలా సినీ సీన్ సృష్టించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. స్థానిక థియేటర్ యజమాని ఒకరు ఇటీవల మరణించగా ఆయన దశదినకర్మకు హాజరయ్యేందుకు వెంకటేశ్వర రావు,  కొడాలి నాని ఈ క్లబ్ కు చేరుకున్నారు. కాగా వెంకటేశ్వర రావు రివాల్వర్ లైసెన్స్ కాల పరిమితి గత ఏడాదే ముగిసింది. దాన్ని రెన్యువల్ చేయలేదు. పోలీసుల కోర్కెపై ఆ రివాల్వర్ ను ఆయన సరెండర్ చేశారు.

 

 
 
 
Related News

JournalistDiary