India / Politics
సైకిల్ గుర్తుకు తాళం...
226 days ago

యూపీలో ములాయం, అఖిలేష్ యాదవ్ వర్గాల మధ్య వివాదం ముదిరి హస్తినకు చేరిన నేపథ్యంలో అధికార సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ పై సరికొత్త సస్పెన్స్ నెలకొంది. ఈ గుర్తు తమకే చెందాలని వీరిద్దరూ పట్టు బట్టారు. ములాయం సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకొని సైకిల్ గుర్తు తమకే చెందాలంటూ ఎన్నికల కమిషన్ ను కలిసి మెమొరాండం ఇచ్చారు.

అయితే అఖిలేష్ వర్గంలోని రాం గోపాల్ యాదవ్ కూడా కమిషన్ ను కలిసి ఇదే డిమాండ్ చేశారు. దీంతో సైకిల్ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు సమాచారం. అఖిలేష్, ములాయంలకు వేర్వేరు గుర్తులను కేటాయించే అవకాశం ఉంది. అటు మంగళవారం అఖిలేష్ వర్గం తిరిగి ఎన్నికల కమిషన్ ను కలిసే అవకాశం ఉంది.

 
 
Related News