AP / Politics
నంద్యాల ఉప ఎన్నికలో రిగ్గింగ్‌కి నో ఛాన్స్ !
70 days ago

నంద్యాల ఉప ఎన్నికలో రిగ్గింగ్, ఓట్ల గల్లంతు వంటి అక్రమాలకిక చెక్ ! తమ ఓటు ఎవరికి వేశామో తెలియజేసే వీవీపీఏటీ (ఓటర్ వేరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ప్రక్రియకు ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. దేశంలో ఇకమీదట ఇదే పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను ప్రవేశ పెట్టింది. ఓటరు తన ఓటు వేసిన తరువాత ఆ పక్కనే ఉన్న మరో యంత్రంలో తాము ఎవరికీ ఓటు వేశామో తెలియజేసే వివరాలు కనిపిస్తాయి.

అంతేకాదు. ఈవీఎంల ఫలితాల మదింపు తర్వాత ఒకవేళ అవసరమైతే ఈ వేరిఫికేషన్ యంత్రం నుంచి స్లిప్స్ ఆధారంగా కూడా పోలైన ఓట్లను లెక్కించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటరు తన ఓటు మరో అభ్యర్థికి నమోదైనట్టు గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. తాను వేసిన ఓటులో ఏదైనా తేడా ఉందని భావిస్తే ఆ విషయాన్ని సిబ్బందికి నివేదించవచ్చు. పైగా తన ఓటు వీవీపీఏటీలో డిస్ ప్లే అవుతుంది కూడా. ఈ స్లిప్స్ విధానం వల్ల రిగ్గింగ్ లేదా ఓట్ల గల్లంతు లాంటి అక్రమాలకు కళ్ళెం పడిపోతుంది. ఆ మధ్య ఈవీఎం ల టాంపరింగ్ పై పార్టీల అనుమానాలు తీర్చేందుకు ఎన్నికల సంఘం వాటి పనితీరు మీద ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే.

 

Read Also

 
Related News
JournalistDiary