India / Politics
మార్చి 11న క్లైమాక్స్
225 days ago

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నసీం అహ్మద్ జైదీ బుధవారం ప్రకటించారు.  యూపీ, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎలెక్షన్స్ ఫిబ్రవరి 4, మార్చి 8 తేదీల మధ్య జరుగుతాయన్నారు. ఎన్నికల ఫలితాలను మార్చి 11 న ప్రకటిస్తామన్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఫిబ్రవరి 4 న, ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 15 న, మణిపూర్ లో రెండు దశల్లో..మార్చి 4,8 తేదీల్లో నిర్వహిస్తామని, అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన వివరించారు. ఫిబ్రవరి 11,15,19, 23, 27,మార్చి 4,8 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి. 

మొత్తం ఈ అయిదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ సీట్లకు ఎలెక్షన్స్ జరుగుతాయి. 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని నసీం పేర్కొన్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 28 లక్షలని, మణిపూర్, గోవాలలో 20 లక్షలని ఆయన వివరించారు. యూపీలో 403, పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, మణిపూర్ లో 60, గోవాలో 40 సీట్లకు ఎన్నికలు రగబోతున్నాయి.

 
 
Related News