AP and TS / General
ఘనంగా పరిటాల శ్రీరాం నిశ్చితార్థం
71 days ago

టీడీపీ నేత, ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం నిశ్చితార్థం గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పలకు చెందిన వ్యాపారవేత్త కుమార్తె ఆలం జ్ఞానను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి తారకరత్న, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, కాల్వ శ్రీనివాసులు, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. శ్రీరాం వివాహం అక్టోబరు 1 న జరుగుతుందని మంత్రి సునీత తెలిపారు.

 

Read Also

 
Related News
JournalistDiary