India / Crime
వీళ్లనేం చెయ్యాలి..?
286 days ago

తాగిన మత్తులో ఇద్దరు కుర్రాళ్ళు అతి వేగంగా కారు నడుపుతూ ఐదుగురు కూలీల ప్రాణాలు తీశారు. వీళ్ళలో ఒకడు మాజీ ఎమ్మెల్యే కొడుకు కాగా మరొకడు ఓ బిజినెస్ మన్ తనయుడు.

సుమారు 20 ఏళ్ళ వయసున్న వీళ్ళు యూపీ హజ్రత్ గంజ్ లో ఆదివారం రాత్రి మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తూ నైట్ షెల్టర్ లో పడుకున్న రోజువారీ కూలీల మీదుగా పోనిచ్చారని, ఈ ఘటనలో ఐదుగురు  మరణించారని పోలీసులు తెలిపారు. వీరిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసినట్టు చెప్పారు. వీరి వద్ద  డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేవని ఖాకీలు పేర్కొన్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.


 

Read Also

 
Related News
JournalistDiary