AP / Politics
జగన్ వివరణ అందింది
11 days ago

వైసీపీ అధినేత జగన్ వివరణ తమకు అందిందని, ఆయన సంజాయిషీపై నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని కోరామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు.

ఆ నివేదిక అందగానే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని ఆయన చెప్పారు. కొంతమంది మంత్రుల పైనా ఫిర్యాదులు అందినట్టు భన్వర్ లాల్ చెప్పారు. నంద్యాల బై పోల్ లో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నెల 23 న పోలింగ్ జరుగుతుందని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

 
 
Related News