World / General
అందుకే ఒక సెకండ్ కలిపారు
202 days ago

భూ పరిభ్రమణ కాలానికి.... ఎప్పుడూ లేనట్టు ఒక లీప్ సెకండును  కలిపారు. భూ రొటేషన్ క్లాక్ నిర్దేశించిన సమయానికి తగినట్టుగా ఆదివారం ఇండియన్ క్లాక్ కి 5:29:59 గంటలకు అదనంగా ఒక సెకండు ను కలిపినట్టు  ఢిల్లీ లోని నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ డైరెక్టర్ ఆస్వాల్ తెలిపారు. ఈ సంస్థలోని అటామిక్ క్లాక్ రాత్రి 11 గంటల ప్రాంతంలో (23:59:59) కొద్దిసేపు ఆగిపోయిందని, ఈ స్వల్ప సమయాన్ని భర్తీ చేసేందుకు ఇలా లీప్ సెకండు ను కలపాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే డైలీ లైఫ్ పై దీని ప్రభావం ఉండదని, కానీ శాటిలైట్ నేవిగేషన్, ఏస్ట్రోనమీ, కమ్యూనికేషన్ రంగాలపై దీని ఎఫెక్ట్ కొంతమేర ఉండవచ్చునని ఆయన అన్నారు.

 

ఎర్త్ రొటేషన్ రెగ్యులర్ గా ఉండదు. భూకంపం,  సముద్ర తరంగాలు, చంద్రుని గ్రావిటేషన్ ఫోర్సెస్ వంటి వాటివల్ల తరచూ కాల గమనం స్లో అవుతుంది. ఫలితంగా అటామిక్ క్లాక్ సమయానికి, దీనికి మధ్య కొంత తేడా వస్తుంది..ఇది 0.9 సెకండ్లు ఉండవచ్చు.. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా అటామిక్ క్లాక్ ల ద్వారా ఒక లీప్ సెకండును కలుపుతాం అని ఆస్వాల్ వివరించారు.మొత్తానికి ఈ కొత్త సంవత్సరంలో టైం కి అదనంగా ఒక సెకండు వచ్చి చేరిందన్న మాట .

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary