AP / crime
బెనిఫిట్ షో వేయలేదని..
193 days ago

ఖైదీ నెం.150 చిత్రం బెనిఫిట్ షో వేయలేదని గుంటూరు జిల్లా కొల్లూరులో శ్రీనివాస థియేటర్ వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మంగళవారం అర్ధ రాత్రి ఒంటిగంటకు ఈ చిత్రం బెనిఫిట్ షో వేస్తామని చెప్పి తెల్లవారినా షో వేయకపోవడంతో ఫ్యాన్స్ కోపం పట్టలేకపోయారు. థియేటర్ తెర చించి, కుర్చీలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. దీంతో థియేటర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి లాఠీ చార్జి చేశారు. తాము ఎంతో ఆశతో థియేటర్ ముందు రాత్రంతా పడిగాపులు పడితే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫ్యాన్స్ వాపోయారు. 

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary