India / Crime
ఉగ్రవాది కాల్పుల్లో ఫ్యాషన్ డిజైనర్ కూడా...
78 days ago

టర్కీ ఇస్తాన్ బుల్ లోని ఓ నైట్ క్లబ్ లో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో మరణించిన వారిలో గుజరాత్ (వడోదర) కు చెందిన ఖుషీ షా అనే ఫ్యాషన్ డిజైనర్ కూడా ఉన్నారు.  బిజినెస్ ట్రిప్ కోసం టర్కీ వెళ్ళిన ఈమె ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో బాటు ముంబై బాలీవుడ్ ప్రొడ్యూసర్ అబిస్ రిజ్వీ కూడా మృతి చెందాడు.

రీనా నైట్ క్లబ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకొంటున్నవారిపై  క్రిస్మస్ శాంటా దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టు విచక్షణా రహితంగా ఫైర్ చేయడంతో 39 మందిమరణించగా..సుమారు 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించుకొంది. ఈ దారుణ ఘటనలో ఇంకా లెబనీస్ వాణిజ్యవేత్త కూతురు రీటా సమి, బ్యాంకర్ హేకేల్, కెనడాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి కూడా మరణించారు.

 

 

 
 
 
Related News

JournalistDiary