AP and TS / Entertainment
30 కోట్ల క్లబ్ దాటేసిన ఫిదా
20 days ago

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేశాడని ఇండస్ట్రీ టాక్. అలానే తన సినిమాల రిలీజ్‌కు ఎప్పుడూ అంతగా మాట్లాడని శేఖర్ ‘ఫిదా’ ప్రమోషన్స్‌లో కొంచెం ఎక్కువగానే మాట్లాడ్డం నిర్మాత దిల్ రాజు కోసమే అనే అపోహలూ హిట్ టాక్‌తో చెదిరిపోయాయి.

హీరోయిన్ సాయి పల్లవి పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతున్న ఆడియన్స్ ఈ మూవీకి 10 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.30 కోట్ల షేర్ అందించారని ట్రేడ్ టాక్. నైజాంలోనే 10 కోట్ల పైగా, ఓవర్ సీస్‌లో 5 కోట్ల పైగా కలెక్ట్ చేసిన ఫిదా.. బీ, సి సెంటర్స్‌లో మాత్రం ఆశించిన వసూళ్లు పొందలేదని, నిర్మాత దిల్ రాజుకు ఆశించిన సక్సెస్ ఇవ్వని డీజేను ఫిదా సర్‌ప్రైజ్ హిట్ అందించిందని బాక్సాఫీస్ టాక్.

 
 
Related News