AP and TS / Entertainment
ఫస్ట్ డే వసూళ్లలో ఎవరు టాప్?
69 days ago

వరసగా సెలవులు రావడంతో ఈ శుక్రవారం టాలీవుడ్‌లో ముగ్గురు నిర్మాతల కొడుకుల సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఫస్ట్ డే దాదాపుగా అన్నీ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందులో రానా- నేనే రాజు.. నేనే మంత్రి, బెల్లంకొండ శ్రీనివాస్- జయ జానకీనాయక, నితిన్ - లై చిత్రాలు కలెక్షన్ల విషయంలో నువ్వానేనా అన్న రేంజ్‌లో పోటీపడ్డాయి. ఇంతకీ ఫస్ట్ డే వసూళ్లలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది?

నేనేరాజు నేనేమంత్రి సినిమా 3 కోట్ల 72 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఏరియాల వారీ వసూళ్లు నైజాం-1. 22 కోట్లు, ఉత్తరాంధ్ర- 68 లక్షలు, సీడెడ్- 65, ఈస్ట్ గోదావరి-35, కృష్ణ- 28, గుంటూరు-24, వెస్ట్- 20, నెల్లూరు- 10 లక్షలు రాబట్టినట్టు తెలుస్తోంది.

 

ఇక జయజానకీ నాయక చిత్రం అయితే 3 కోట్ల 27 లక్షలు రాబట్టింది. నైజాం-90 లక్షలు, సీడెడ్- 55, గుంటూరు- 49, ఉత్తరాంధ్ర- 45, వెస్ట్- 28, ఈస్ట్- 24, నెల్లూరు- 20, కృష్ణ- 16 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

ఫైనల్‌గా ‘లై’ మూవీ థర్డ్ ప్లేస్‌కి వెళ్లింది. కేవలం 2 కోట్ల 27 లక్షల మాత్రమేనట. నైజాం-81 లక్షలు, సీడెడ్- 42, ఉత్తరాంధ్ర- 32, ఈస్ట్- 21, గుంటూరు-17, కృష్ణ- 17, వెస్ట్- 11, నెల్లూరు- 6 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఫస్ట్ డే టాక్ పరంగా ‘నేనేరాజు’ టాప్ పొజిషన్‌లో ఉంటే.. జయ జానకి బీ,సీ సెంటర్లలో, లై.. ఏ సెంటర్లను ఆకట్టుకున్నాయి. నిర్మాతలకు లాభమా? నష్టమా? అనేది తేల్చాల్సింది మిలిగిన నాలుగు రోజులే!

 

Read Also

 
Related News
JournalistDiary