AP and TS / General
ఆ సినిమా గుర్తొస్తోంది.....
118 days ago

సెవెంత్ సెన్స్ మూవీలో హీరో సూర్య పూర్వ జన్మలో తానెవరో తెలుసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తాడు.  చివరకు డీఎన్ఏ విశ్లేషణ తో..పల్లవుల హయాంలో తానొక అతీత శక్తులు, మూలికా వైద్యంలో నిష్ణా తుడైన బోధిధర్ముడని తెలుసుకుంటాడు. ఆ సినిమా సంగతి అటుంచితే.. ఇప్పుడు ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలోని ప్రజల పూర్వీకులెవరో, ఎక్కడివారో తెలుసుకునే పనిలో పడ్డారు నిపుణులు. మొదట తెలంగాణా విషయానికొస్తే.. సిద్ధిపేట లోని మెగాలిథిక్ సమాదుల్లోని మానవ అవశేషాలను స్టడీ చేస్తారట..

వారి డీ ఎన్ ఏ డేటాను  , ప్రస్తుత ప్రజల డీ ఎన్ ఏ డేటాను పోల్చి చూస్తారట. దీనివల్ల తమ తాత ముత్తాతలు, అంతకన్నా పూర్వమున్న తమ వంశీకుల వివరాలను ఇప్పటి వారు తెలుసుకోగల్గుతారు.  హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్  మాలిక్యులర్ బయాలజీ) , ఆర్కియాలజీ శాఖలు ఈ విషయంలో సంయుక్తంగా పరిశోధనలకు నడుం కట్టాయి. డీ ఎన్ ఏ డీకోడింగ్, డేటా విశ్లేషణలను పూణే లోని దక్కన్ కాలేజీకి చెందిన నిపుణులు కూడా పరిశీలించి తమ వంతు సహకారం అందిస్తారని తెలిసింది. ఇలాంటి ప్రయోగం దేశంలోనే ఇదే మొదటిసారని అంటున్నారు. ఈ రీసెర్చికి సంబంధించి ఆర్కియాలజీ డైరెక్టర్ వెంకటేశం, సీ సీ ఎం బీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మధ్య ఒప్పందం కుదిరింది.

 

 
 
 
Related News

JournalistDiary