World / Entertainment
అండ్ ది అవార్డ్ గోస్
105 days ago

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. లాస్ ఏంజిల్స్ లో ఆదివారం రాత్రి జరిగిన గోల్డెన్ గ్లోబ్స్-2017 అవార్డుల ఫంక్షన్ లో మొదటిసారిగా మెరిసింది. టీవీ కేటగిరీలో విజేతకు అవార్డును అందజేయడానికి ప్రియాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్, నటాలీ పోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్ కం లభించడం విశేషం.

ది వాకింగ్ రెడ్ స్టార్ చిత్రంలో నటించిన నటుడు జెఫ్రీ డీన్ మోర్గాన్ తో కలిసి స్టేజీపై చిరునవ్వులు చిందించిన ఈ అమ్మడు..బెస్ట్ టీవీ యాక్టర్ గా ఎన్నికైన బిల్లీ బాబ్ థార్న్ టన్ కు అవార్డు ప్రదానం చేసింది. హెడ్ లైన్ స్టార్ ఆఫ్ అమెరికన్ నెట్ వర్క్ షో-క్వాంటికో హోదాలో ప్రియాంక ఈ అరుదైన గౌరవం పొందింది. గత ఏడాది ఆస్కార్, ఎమ్మీ అవార్డుల ప్రదానం కోసం ఆహ్వానం అందుకున్న ప్రియాంక..తాజాగా ఇంటర్నేషనల్ అవార్డుల షో కు హాజరై ఇలా వీటిని ప్రదానం చేయడం ఇది మూడో సారి. గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ లో మాత్రం మొదటిసారి. ఈమె నటించిన బే వాచ్ హాలీవుడ్ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది.

 

 
 
 
Related News

JournalistDiary