India / Crime
ఆదిత్యనాథ్ సర్కార్‌దే బాధ్యత
68 days ago

గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో 48 గంటల్లో 30 మంది పిల్లలు మరణించడానికి బాధ్యత వహించాలంటూ ఆసుపత్రి హెడ్ డాక్టర్ రాజీవ్ మిశ్రాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ఐదురోజుల్లో మృతిచెందిన పిల్లల సంఖ్య 63కి పెరిగిన సంగతి తెలిసిందే.

అయితే.. ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలని తాను మూడుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని రాజీవ్ మిశ్రా అంటున్నారు. తాను చివర్లో రాసిన లేఖనే పరిగణనలోకి తీసుకుందని ఆయన చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత గురించి తాను జూలై 3, 19.. ఆగస్టు 1 తేదీల్లో ప్రభుత్వానికి లేఖలు రాశానని.. కానీ ఆగస్టు 1 నాటి లేఖనే ప్రభుత్వం పట్టించుకుందని ఆయన చెప్పారు.

కాగా.. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ని గోరఖ్‌పూర్ పంపి.. పరిస్థితిపై ఆరా తీయాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు.

 

Read Also

 
Related News
JournalistDiary