India / Politics
గవర్నర్‌గా కృష్ణంరాజు.!
225 days ago

తెలుగునేల మీద  పుకార్లకు కొదవే లేదు. అందులోనూ రాజకీయాలు, సినిమాల్లో ఈ పుకార్లు యమవేగంగా స్ప్రెడ్ అవుతుంటాయి. అసలు విషయానికొస్తే... టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా ఫేం సంపాదించుకుని  బీజెపీ తరఫున  క్రియాశీలక రాజకీయాల్లో  పాల్గొన్న కృష్ణంరాజు యంపీగా, కేంద్రమంత్రిగా పలువదవులు అలంకరించారు. అయితే ఉన్నట్టుండి నటుడు, బిజెపి నాయకుడు కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారనే వార్త గుప్పుమంది. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ అయింది. అయితే..  గతంలో కూడా ఇలాంటి వార్తలొచ్చాయనీ, ఇందులో వాస్తవం లేదంటూ  బీజెపీ తేల్చి చెప్పింది.

 
 
Related News