AP and TS / Entertainment
గౌతమిపుత్ర శాతకర్ణికి గ్రీన్ సిగ్నల్......
106 days ago

బాలయ్య మూవీ గౌతమీపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయింపు నిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైదరాబాద్ హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. జస్టిస్ చల్లా కోదండ రాం, జస్టిస్ శ్యాం ప్రసాద్ లతో కూడిన బెంచ్,, ఈ వెకేషన్ లో ఇలాంటి పిటిషన్లను ఇంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మినహాయింపు నిర్మాతకే ప్రయోజనం కల్పిస్తుందని పిటిషనర్ తన లంచ్ మోషన్ లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 9 న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1939 నాటి టాక్స్ రూల్స్ కు అనుగుణంగా లేదన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా పన్ను మినహాయింపు అవసరం లేదని ప్రభుత్వం భావించిన పక్షంలో దాన్ని తిరిగి రాబట్టే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని బెంచ్ స్పష్టం చేసింది.

 

 
 
 
Related News

JournalistDiary