World / Health
రోగాల నియంత్రణలో ఇండియా ఫెయిల్
285 days ago

భారత్ లో రోగాలు అడ్డూ అదుపూ లేకుండా వ్యాప్తి చెందుతున్నాయని, ప్రభుత్వం వీటిని నివారించలేక విఫలమవుతోందని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇండియాలో  ఈ సంస్థ ప్రతినిధి అయిన హెంక్ బెకెడామ్ ఇలా ఆశ్చర్యంగా భారత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఢిల్లీ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక ప్రతినిధి ఇలా వ్యాఖ్యానించడం అరుదని అంటున్నారు. ఈ దేశంలో వ్యాధి నిరోధక నిఘా వ్యవస్థ సరిగా పని చేయడంలేదని అన్నారు.

చికున్ గున్యా, డెంగ్యూ వంటి కేసులు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం  చెప్పడం ఈ తప్పుడు సిస్టం వల్లే అని ఆరోపించారు. వ్యాధుల నివారణకు, లేబొరేటరీల సామర్థ్యాన్ని పెంచేందుకు నిరంతరాయ కృషి జరగాలని, ఇందుకు పెట్టుబడులు పెరగాలని అభిప్రాయపడ్డారు. అనేకమంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకన్నా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడాన్ని ఆయన ప్రస్తావించారు. కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ఇచ్చే నివేదికలపైనే ప్రభుత్వం ఆధారపడడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ప్రైవేటు రంగంలోనే  హెల్త్ కేర్ ఫెసిలిటీలను జానాభాలో చాలామంది వినియోగించుకుంటున్నారని, ఇప్పటికైనా మరింత మెరుగైన డేటాను  సమీకరించుకుని పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు.

 

 
 

Read Also

 
Related News

JournalistDiary