India / Entertainment
లావణ్య ప్లేస్‌లో హెబ్బా
12 days ago

రీసెంట్‌గా ‘అంధగాడు’ సక్సెస్‌తో జోష్‌లో వున్న హెబ్బా పటేల్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. తెలుగులో హిట్ అయిన ‘100% లవ్’ తమిళ్‌లో సుకుమార్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. జివి ప్రకాష్ హీరోగా చేస్తున్న ఈ రీమేక్‌లో లావణ్య హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ.. సుకుమార్ శిష్యుడు, ఈ రీమేక్ డైరెక్టర్ చంద్రమౌళి లావణ్య - జివి ప్రకాష్‌కి మిస్ మ్యాచ్ అవుతుందని, హెబ్బా అయితే బాగుంటుందని చెప్పాడట.

సుకుమార్ కూడా అదే ఫీలవడంతో లావణ్య ప్లేస్‌లో హెబ్బాని ఫైనల్ చేసేశాడట. ‘మిస్టర్’, ‘రాధ’ ఫ్లాప్స్‌తో డల్ అయిన లావణ్య చేతిలో నుండి ఇప్పుడు ఈ రీమేక్ మూవీ జారిపోవడం షాకింగ్‌గానే ఉంటుంది. ఇక తెలుగులో కుమారిగా యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హెబ్బా.. ‘100% లవ్’ రీమేక్‌తో తమిళ తంబీల మతులు పోగొట్టడానికి రెడీ అవుతోందన్న మాట.

 

 
 
 
Related News

JournalistDiary