India / Entertainment
వెనక్కి తగ్గిన హీరో సుదీప్!
285 days ago

ఈగ ఫేమ్ సుదీప్ తన మైండ్‌సెట్ మార్చుకున్నాడు. ఫ్యామిలీ సమస్యలను పరిష్కరించుకు వైఫ్‌తో కలసి జీవించాలని డిసైడ్ అయ్యాడు. కొద్దిరోజుల కిందట సుదీప్- ప్రియ దంపతులు డైవోర్స్ కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే! తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాళ్ల కుటుంబాల్లో సంతోషం నెలకొంది.

ఒక్కసారి వెనక్కి వెళ్తే...  సుదీప్- ప్రియ 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. హ్యాపీగా సాగుతున్న వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి.. చివరకు విడిపోవాలని నిర్ణయించుకోవడం, విడాకుల కోసం గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా! వైఫ్‌కి పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు సుదీప్. ఐతే, ఇరుకుంటుబాలకు ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు సుదీప్- ప్రియ కలిసే బతకాలని నిర్ణయించుకోవడం ఇన్‌సైడ్ సమాచారం. విడాకులకు అప్లై చేసుకుని మళ్లీ వీళ్లిద్దరు కలవాలని భావించడం బహుశా ఫిల్మ్ ఇండస్ర్టీలో ఇదే ఇదే ఫస్ట్ టైమ్ అని అనుకుంటున్నారు. 

 

Read Also

 
Related News
JournalistDiary