World / Health
ఐస్ బాత్‌‌తో ఒళ్ళంతా నిగనిగ
183 days ago

అత్యంత చల్లదనానికి వణుకుతూనే..ఐస్‌‌తో కూడిన వాటర్‌‌లో స్నానం చేశారంటే ఇక హెల్త్‌‌కి ఢోకా లేదట.. కూల్..కూల్ గా హీట్ ని బీట్ చేస్తూ.. చల్లని మంచు గడ్డల మధ్య శరీరాన్ని సేద దీరిస్తే..బాడీలోని నరాలన్నీ స్టిమ్యులేట్ అవుతాయని, చర్మం కాంతివంతంగా నిగనిగలా మెరుస్తుందని అంటున్నారు.

సాధారణ స్నానికి, దీనికి చాలా తేడా ఉందని హెల్త్ ఎక్స్‌‌‌పర్ట్స్ చెబుతున్నారు. ఫ్రెష్‌‌‌గా ప్లక్ చేసిన చికెన్ ఫ్లెష్‌‌‌లా నా శరీరం నవనవలాడుతోంది అని ఓ అమ్మడు సంబరంగా చెప్పింది. ఇలాంటి కోల్డ్ బాత్ భలే అనుభూతి నిస్తోంది అని చెప్పింది.

చల్లని టెంపరేచర్లు బ్లడ్ వెసల్స్ ని సంకోచింపజేస్తాయి. వేడి ఉష్ణోగ్రతలు వాటిని వ్యాకోచింపజేస్తాయి అని విశ్లేషిస్తున్నారు. కోల్డ్ నుంచి హాట్ లోకి వెళ్ళగానే ప్రాజెక్టు స్లూయిస్ గేట్‌‌లా ఓపెన్ అయి..రక్తం శరీరమంతా సర్క్యులేట్ అవుతుందని తేల్చారు.

స్కాండినేవియా , జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల్లో ఇలాంటి వెరైటీ షవర్ టైప్ బాత్‌‌లు ఎన్నో ఉన్నాయి. ఫైర్ అండ్ ఐస్ ట్రీట్ మెంట్స్ అని వీటిని అంటారట. బ్యూటీ ట్రీట్ మెంట్ లో ఇదీ భాగమేనని అంటున్నారు. అయితే ఇలాంటి స్నానాలతో జలుబు చేస్తుంది కదా అంటే దానికి వేరే ట్రీట్ మెంట్ ఉందిగా అని కూడా సెలవిస్తున్నారు.

 
 
 
Related News

JournalistDiary