World / General
అదృష్టవంతుడు ఇతడే, వ్యాన్‌లో నుంచి
65 days ago

వేగంగా వెళ్తున్న వ్యాన్‌ నుంచి దూకేశాడు డ్రైవర్. ఆ వెంటనే దూరంగా పరిగెత్తాడు. కొన్ని క్షణాల్లో వాహనం మంటల్లో
పూర్తిగా కాలి బూడిదైంది. ఈ షాకింగ్ ఘటన చైనా డోంగ్వాన్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్
మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి తన వ్యాన్‌లో డోంగ్వాన్‌ రోడ్డులో ట్రావెల్ చేస్తున్నాడు. వాహనం ఇంజన్‌లో మంటలు రావడం గమనించాడు,

ఏం జరిగిందో చూసే సమయం లేదని గ్రహించిన ఆ వ్యక్తి, ఒక్కసారిగా వ్యాన్‌లోంచి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. దూకిన కొన్ని క్షణాల్లో వాహనం మంటల్లో కాలి బూడిదైంది. ఆ వ్యాన్‌తో పాటు పార్కింగ్ ప్రదేశంలో మరో ఏడు వాహనాలు కాలి బూడిదయ్యాయి. దూకిన వ్యక్తి అసలైన అదృష్టవంతుడని నెటిజన్లు అంటున్నారు.

 
 
Related News