Telangana / Crime
17.9 కోట్లు చైన్ స్నాచర్ల చేతిలోకి
219 days ago

అయిదేళ్ళు..చైన్ స్నాచర్ల చేతిలోకి రూ. 17.9 కోట్లు.. హైదరాబాద్ సిటీలో ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఇన్ని కోట్ల విలువైన బంగారు చైన్లను, మంగళ సూత్రాలను మహిళల మెడల్లోం ఛి లాక్కుపోయారని పోలీసుల నివేదిక తెలిపింది. బైక్‌‌ల పై శరవేగంగా వస్తూ అదమరపుగా ఉన్న మహిళలు, యువతులను చైన్ స్నాచర్లు టార్గెట్ చేసుకుని క్షణాల్లో మాయమవుతున్నారు.

2011-2016 మధ్యకాలంలో ఇలాంటి కేసులు సుమారు మూడు వేలకు పైగా నమోదయ్యాయి. అంతర్ రాష్ట్ర ముఠాలు ఇలా దోపిడికి పాల్పడి రాష్ట్రం విడిచి పారిపోతున్నారని, పరిస్థితి కూల్ అయిందని తెలియగానే మళ్ళీ రాష్ట్రంలో చెలరేగిపోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఎక్కువగా బీహార్, యూపీ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలనుంచి వస్తున్నక్రిమినల్స్ చైన్ స్నాచర్లుగా మారి పోలీసులకు తలనొప్పితెస్తున్నారు. గతంలో సుమిత్ర అనే మహిళ ఇలాంటివారి బారిన పడి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సీ సీ టీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు ఈ ముఠాలను పట్టుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడంలేదని బాధితులు వాపోతున్నారు. 

 
 
Related News