India / Crime
ఐఏఎస్ అధికారి సూసైడ్
10 days ago

బీహార్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేష్ పాండే ఆత్మహత్య చేసుకున్నారు. ఘజియాబాద్ లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఛిద్రమైన ఆయన మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. తన సూసైడ్ కు ఎవరూ కారణం కాదని, తన సొంత నిర్ణయంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని పాండే తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

మరిన్ని వివరాలు  ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో ఉన్న తన బ్యాగ్ లో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. జీవితంలో విసుగెత్తిపోయి ఓ బిల్డింగ్ లోని పదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అంతకుముందు పాండే ఓ సూసైడ్ నోట్ రాసి ఆ విషయాన్ని తన ఫ్రెండ్ కు మెసేజ్ పంపారు. అయితే ఆ బిల్డింగ్ నుంచి ఆయన రైల్వే ప్లాట్ ఫాం దిశగా వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది. 2012 బ్యాచ్ కు చెందిన ముకేష్ పాండే కు సమర్థుడైన అధికారిగా మంచి పేరుంది.

 
 
Related News