AP / general news
250 థియేటర్లు మూతబడినట్టేనా !
08:51 AM on 18th October, 2014

హుధూద్ తుఫాను బీభత్సం పరోక్షంగా టాలీవుడ్ సినీ పరిశ్రమనూ ఘోరంగా దెబ్బతీసింది. దీని ధాటికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 250 సినీ థియేటర్లకు తీవ్రనష్టం వాటిల్లిందట ! జనరేటర్లతో వీటిని పునరుద్ధరిద్దామని అనుకున్నా డీజిల్, విద్యుత్ సరఫరా లేక ఈ థియేటర్లు బోసిపోయి ఉన్నాయని సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్‌బాబు తెలిపారు. ప్రధానంగా విద్యుత్ సరఫరాను ఇళ్లకు పునరుద్దరించినప్పటికీ.. సినిమాహాళ్లకు తిరిగి ఎప్పుడు ఈ సౌకర్యం లభిస్తుందో తెలియదు. 

విడుదలైన కొత్త సినిమాల వసూళ్లు ఈ జిల్లాలనుంచి కూడా ఎక్కువగానే ఉంటాయని, అయితే థియేటర్లు మూతబడడంతో కలెక్షన్ల మాట అటుంచి.. ఇవి ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. 20 రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ని పునరుద్దరిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ థియేటర్ల పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. నాగచైతన్య- ‘ఒకలైలాకోసం’ వంటి కొత్తసినిమాలు శుక్రవారం రిలీజైన సంగతి విదితమే .

 

 
 
 
Related News