World / Entertainment
ఆరు నెలలు బేఫికర్
12 days ago

భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగ్గొట్టిన డీఫాల్టర్ విజయ్ మాల్యా ..భారత మీడియా తనమీద ద్వేషపూరిత ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దీనికి ఓ హద్దంటూ లేకపోతోందని ట్వీట్ చేశారు. తనపై భారత ప్రభుత్వం బ్రిటన్ కోర్టులో కేసు వేసిందని, ఆ తీర్పు వచ్చేవరకు వేచి ఉండాలని ఆయన కోరాడు. బ్యాంకులకు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణం చెల్లించకుండా బ్రిటన్ పారిపోయిన మాల్యాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ ను కోరుతున్న సంగతి తెలిసిందే.

ఈ విషయమై లండన్ కోర్టు డిసెంబర్ 4 నుంచి రెండు వారాల పాటు విచారణ జరపనుంది. అంతవరకూ ఆయన బెయిలుపైనే ఉంటాడు. ఇటీవల ఎడ్జ్ బాస్టన్ లో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు తాను దాన్ని ఆసక్తిగా చూసిన వైనం పైనా భారత మీడియా అతిగా వ్యవహరించిందని మాల్యా అన్నారు. ఇండియన్ జట్టును ఉత్సాహపరిచేందుకు ఆ జట్టు పాల్గొనే అన్ని మ్యాచ్ లనూ చూస్తానని ఆయన పేర్కొన్నాడు. కాగా మాల్యా ను అప్పగించాలన్న అంశంపై ఇండియా తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్..లండన్ కోర్టులో వాదిస్తోంది.

 

 
 
 
Related News

JournalistDiary