India / Crime
500 ఫ్లాట్లు..300 కోట్లు
123 days ago

తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహనరావు కొడుకు వివేక్ కూడా మామూలోడు కాదు.. ఆయనా బోలెడు అక్రమాస్తులు సంపాదించాడని ఐటీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. తమిళనాడు తిరువాన్మియూరు లోని వివేక్ ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు.

బెంగుళూరులో ఇతగాడు 500 లగ్జరీ ఫ్లాట్లు కొన్నాడని, తన స్నేహితుడు భాస్కర నాయుడుతో కలిసి ఆ సిటీలోనే ఓ ఆసుపత్రిని, ఔట్ సోర్సింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడని ఈ పత్రాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ మెడికల్ డిపార్ట్ మెంట్ ద్వారా ఈయన 300 కోట్ల మేర కాంట్రాక్టులు పొందాడని కూడా వెల్లడైంది.

తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వివేక్ చెలరేగి పోయాడని అంటున్నారు. ఈయన ఆస్తులు, పెట్టుబడుల విషయంలో విచారించేందుకు ఈ నెల 24 న తమ ఎదుట హాజరు కావాలని ఐటీ శాఖ సమన్లు జారీ చేసినా..తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, తరువాత వస్తానని వివేక్ తప్పించుకున్నట్టు తెలిసింది.

 

 

 
 
 
Related News

JournalistDiary