World / Health
ఇలా తింటే ఆరోగ్యం మీ సొంతం..
91 days ago

అసలేం తినాలి..? ఏం తినకూడదు..? తింటే ఎంత తినాలి..? హెల్త్ కాన్షస్ పెరిగిపోయిన ఈ రోజుల్లో్ తిండికి యమ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మారుతున్న రోజులను బట్టి ఫుడ్ హాబిట్స్ కూడా మార్చుకోవాలంటున్నారు డాక్టర్లు. పొద్దున్నే నిద్రలేవగానే చేతిలో టీ కప్పు లేనిదే చాలామందికి తెల్లారదు. ఇకనుంచి టీ కి టాటా చెప్పి కాఫీకి మారిపోండంటున్నారు డైటిషియన్లు. అలాగే సండే హోయా మండే రోజ్ కావో అండే అని అంటుంటారు.. కానీ ప్రాణముండి కదల్లేని గుడ్డు తినే కన్నా, చకచకా కదిలే చేపలు తింటే కంటికీ వంటికీ మంచిదని సలహా ఇస్తున్నారు. బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడం సబబే, అలాగని అదేపనిగా చెడామడా తినేయడం కూడా మంచిది కాదట.

పోటాటో, స్వీట్ పొటాటో లాంటివి తీసుకునే కంటే ఉల్లిపాయను ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం మేలట. మార్కెట్‌లో రంగు రంగుల ప్యాక్‌ల్లో దొరికే ఆరంజ్ జ్యూస్‌లు తాగేకంటే.. ప్రకృతి‌లో లభించే కొబ్బరి నీళ్ళు తాగడమే మేలంటున్నారు. కూరలకు రుచితోపాటు ఘాటు తెచ్చేందుకు కారం పొడికి బదులుగా దాల్చిన చెక్క వాడితే శరీరానికి మంచిదట. ఇక కూరల్లో, వివిధ ఆహారపదార్ధాల్లో సన్‌ ఫ్లవర్, పప్పునూనెలకు బదులుగా కొబ్బరినూనె వాడితే ఆరోగ్యంతో ఉంటారని రీసెంట్ పరిశోధనలు చెబుతున్నాయి.అలాగే.. కూరల్లో ఘాటుకు అల్లం బదులుగా జీలకర్ర వాడితే బెటరట. సో మీ ఫుడ్ హాబిట్స్ కొద్దిగా మార్చుకుంటే  మీరే ఆరోగ్య వంతులు.. ధనవంతులు కూడా! ఇక ఫైనల్‌గా కిరోసినా.. గ్యాస్ పొయ్యా అన్న డిస్కషన్‌కి వస్తే గ్యారెంటీగా గ్యాస్ బెటరని తేల్చిచెప్పారు. గ్యాస్ అయితే మార్కెట్లో అందుబాటులో వుంటుందని, కిరోసిన్ మార్కెట్లో దొరకడం కాసింత కష్టంగానే వుంటుందని, దీనికితోడు కల్తీ బెడద ఎక్కువ కావడంతో గ్యాస్ సేఫని చెబుతున్నారు.  

 

 

 
 
 
Related News

JournalistDiary