AP / Entertainment
జగన్ చూపు లెఫ్ట్ వైపు!
8 days ago

ముందస్తు ఎన్నికలు రావచ్చన్న సంకేతాల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. నిన్నమొన్నటివరకు బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు కనిపించిన జగన్, తాజాగా తన వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. సీపీఎంకి చెందిన పెనుబల్లి మధు,
సీపీఐ నాయకుడు కె.రామకృష్ణ అరెస్ట్‌లను ఖండిస్తూ ఆయన ప్రకటన చేయడం సంచలనాత్మకంగా మారింది.

 

శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ప్రయోజనాల కోసం ఈ నేతలిద్దరు పోరాడుతున్నారు. ఐతే, ప్రజల న్యాయమైన డిమాండ్‌ను తీర్చాలంటూ ఈ నేతలు చేస్తున్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని వాళ్లని ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం, వీళ్ల పట్ల కక్ష పూరితంగా ప్రవర్తించడం ఏంటని జగన్ ప్రశ్నించారు. చాలాకాలం తర్వాత లెఫ్ట్ పార్టీలకు
అనుకూలంగా జగన్ మాట్లాడడం బహుశా ఇదే తొలిసారి.

 

Read Also

 
Related News
JournalistDiary