AP and TS / Entertainment
జూనియర్ కి దసరా బస్సు మిస్సేనా?
10 days ago

టీజర్, లుక్ లతో తెగ సందడి చేస్తున్న జూ ఎన్టీఆర్ 'జై లవకుశ'.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం.. అంత క్లారిటీని పాటించలేకపోతున్నాడు. ముందుగా సెప్టెంబర్ 21న దసరా సీజన్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది జైలవకుశ. ఇటీవలే కీలకమైన పుణె  షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న జై యూనిట్.. తర్వాత షెడ్యూల్ ను కూడా కంటిన్యూ చేస్తోంది.

ఈ నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తయితే దసరాకు రావడం కుదురుతుంది. కానీ.. సెప్టెంబర్ లో కూడా 15 రోజుల షూటింగ్ చెయ్యాల్సిరావచ్చట. ఇంకా.. వీఎఫ్ఎక్స్ తదితర పనులు కూడా మిగిలే వున్నాయి. ఇవన్నీ హడావిడిగా చేసినా 21  లేదా 28కి రిలీజ్ కష్టమే అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ క్యాంప్ నుంచి డౌట్స్ వినిపిస్తున్నాయి. పైగా ట్రిపుల్ రోల్ కు తగ్గట్టు గ్రాఫిక్ వర్క్స్ హెవీగా చెయ్యాల్సి రావడం కూడా యూనిట్ కు అదనపు భారంగా మారింది. అందుకే.. సినిమా రిలీజ్ ఇంకాస్త డిలే అయ్యే ఛాన్స్ ఉందని, జై అక్టోబర్ లోనే వస్తాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది.

 
 
Related News