India / Politics
ఆమె లేకపోవడం మనకు ఛాన్స్....
48 days ago

తమిళనాడులో జయలలిత లేకపోవడం తమ బీజేపీ కి మంచి ఛాన్స్ అంటున్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. రాష్ట్రంలో తమ పార్టీ రాజకీయంగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. అన్నా డీ ఎం కె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన ఆయన.. తమిళనాట జయలలిత గొప్ప నాయకత్వం, ఆమె ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉండేదని, బీజేపీ సానుభూతిపరులను  కూడా ఆమె ఏ ఐ డీఎంకె వైపు ఆకర్షించగలిగారని అన్నారు.

డీఎంకె తో పోలిస్తే అన్నా డీఎంకె యే బెటర్ అని ప్రజలు భావించారు.. అలాగే బీజేపీ కార్యకర్తల్లో కొందరు కూడా ఆ పార్టీ పట్ల మొగ్గు చూపారు అని అన్నారు. అందువల్లే అంతా ఒకప్పుడు అన్నా డీ ఎం కె కు ఓటు వేశారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని వెంకయ్య పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో కేంద్రం కలిసి పని చేస్తుందని, అక్కడి అధికార అన్నా డీ ఎంకే వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. సీ ఎం గా పన్నీర్ సెల్వం ఎంపికలో తాను జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పారు. జయలలిత భౌతిక కాయానికి తిరిగి పోస్ట్ మార్టం చేయడం తగదని అయన అభిప్రాయపడ్డారు.


 
 
 
Related News

JournalistDiary