India / Crime
జార్ఖండ్ అడవుల్లో సైబర్ క్రిమినల్స్
290 days ago

దేశంలో సైబర్ నేరాలు ఎక్కడఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవాల్సి వస్తే.. జార్ఖండ్ లోని జంతారా జిల్లా అడవుల నుంచేనని చెప్పక తప్పదు. రాజధాని రాంచీకి సుమారు 225 కి.మీ. దూరంలోని ఈ జిల్లాలో గల అడవుల్లో సైబర్ నేరగాళ్ళు తిష్ట వేసుకుని కూచున్నారట. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో చాలామంది సైబర్ క్రిమినల్స్ ఈ అడవులనుంచే తమ దందా సాగిస్తున్నారని వెల్లడైంది. యూజర్ల స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడంలో నేర్పరులైన వీళ్ళు క్షణాల్లో వారి బ్యాంక్ ఖాతాలు ఇతర వివరాలను తెలుసుకుని వారి అకౌంట్ల నుంచి సొమ్ము తమ ఖాతాల్లోకి మళ్ళించుకోగలుగుతున్నారని తెలిసింది.

నోట్ల రద్దు ఈ క్రిమినల్ గ్యాంగ్ కు వరంగా మారింది. డిమానిటైజేషన్ తరువాత ప్రభుత్వ నిబంధనలను పాటించని, ట్యాక్స్ ఎగవేతదారులే వీరి టార్గెట్. తాము ఫలానా బ్యాంకు ప్రతినిదులమని, మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందని, వివరాలు చెబితే దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయిస్తామని చెప్పి వారి డీటైల్స్ అన్నీ తెలుసుకుని రంగంలోకి దిగుతారు.  కొద్దిసేపట్లోనే డెబిట్ కార్డుల్లోని నగదు అంతా మాయమవుతుంది. సర్కారీ రూల్స్ పాటించని నల్ల కుబేరులకు  ఈ యవ్వారం తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కిమ్మనకుండా ఉండి  పోతున్నారట. జంతారా అడవుల్లోని ఈ ముఠాలు కేవలం ఓ రెండు మూడు డెబిట్ కార్డుల ద్వారా రోజుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు కాజేస్తున్నాయని, ఖరీదైన కార్లలో తిరుగుతూ విలాసవంతమైన లైఫ్ అనుభవిస్తున్నారని తేలింది. పోలీసులు కొంతమందిని అరెస్టు చేస్తున్నా ఈ దందాను అరికట్టలేకపోతున్నారు.దేశంలో జరుగుతున్న సైబర్  నేరాల్లో 80 శాతం ఇక్కడి నుంచేనన్నది షాకింగ్ న్యూస్.

 

Read Also

 
Related News
JournalistDiary