India / Entertainment
త్రిష కోరిక తీరేనా..?
145 days ago

చెన్నై చిన్నది త్రిష 30 ప్లస్‌లో కూడా ఛార్మ్ తగ్గకుండా ఆఫర్లు అందుకుంటోంది. తెలుగు, తమిళ్‌లో టాప్ హీరోలతో జతకట్టిన త్రిష.. హీరోయిన్‌గా 15 ఇయర్స్ పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ్‌లో హిట్స్ ఇచ్చి సక్సెస్ అయిన త్రిష బాలీవుడ్‌లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆమధ్య కొంచెం డల్ అయిన త్రిష కెరీర్.. ధనుష్ హీరోగా వచ్చిన ‘ధర్మ యోగి’తో మళ్ళీ స్పీడందుకుంది.

తెలుగు, తమిళ్‌లో వున్న అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన త్రిష ఒక్క రజనీకాంత్‌తో మాత్రం ఇప్పటివరకూ హీరోయిన్‌గా చేయలేకపోయింది. త్రిష కూడా రజనీకాంత్‌తో సినిమా చేయడానికి ఎప్పటి నుండో ట్రై చేస్తూనే వుంది.. కానీ ఇప్పటికీ వర్కవుట్ కాలేదు. రజనీ లేటెస్ట్ మూవీ ‘కాలా’లో అయినా ఆఫర్ వస్తుందనుకున్న త్రిషకి బాలీవుడ్ హీరోయిన్ హెమా ఖురేషీని ఫైనల్ చేసి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ రంజిత్. ఇక త్రిషకి రజనీతో చేయడం కష్టమే అంటున్నారు క్రిటిక్స్.

 

Read Also

 
Related News
JournalistDiary