AP and TS / Entertainment
కాజల్‌ చెప్పే కథలు విన్నారా..?
135 days ago

ఇన్నోసెంట్‌గా కనిపించే బ్యూటీ కాజల్ చాలా ఇంటెలిజెంట్‌గా మాట్లాడుతోంది. తెలుగు, తమిళ్‌లో టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా వున్న టైంలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిలైపోవడానికి చాలా ట్రై చేసింది. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లాంటి సీనియర్ హీరోలతో హిట్ సినిమాలు చేసినా.. కాజల్‌కి బాలీవుడ్‌లో ఆఫర్లు కరువయ్యాయి. దాంతో మళ్ళీ సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం తెలుగులో రానాతో ‘నేనే రాజు.. నేనే మంత్రి’, తమిళ్‌లో అజిత్ ‘వివేగం’ మూవీలు చేస్తూ బిజీగా వుంది కాజల్. బాలీవుడ్ ఆఫర్లు తగ్గాయా అని అడిగితే.. ‘అదేం లేదు హిందీ నుండి ఆఫర్లు వస్తూనే వున్నాయి కానీ నేనే ఫోకస్ పెట్టడం లేదు. తెలుగు, తమిళ్ సినిమాలు చేయడానికే ఇ‌ష్టపడతాను. నేను పుట్టింది నార్త్‌లోనే అయినా సౌత్ ఇండియా అమ్మాయిగానే ఫీలవుతాను’ అంటోంది. బాలీవుడ్‌లో ఆఫర్లు లేకే కాజల్ ఇలా సౌత్ ఇష్టం అంటూ కథలు చెబుతోందని గుసగుసలు వినబడుతున్నాయి.

 

Read Also

 
Related News
JournalistDiary