India / Entertainment
కాజలే కోలివుడ్ ‘క్వీన్’
71 days ago

కంగనా రనౌత్ లీడ్ రోల్ చేసిన ‘క్వీన్’ మూవీ 2013లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ బడా హీరోలకి షాక్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేయడానికి చాలాకాలం నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమన్నా లీడ్ రోల్‌లో ‘క్వీన్’ తమిళ్ రీమేక్ చేయాల్సింది. కానీ.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో తమన్నాని తప్పించేసారు.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. కాజల్ లీడ్ రోల్లో క్వీన్ తమిళ్ రీమేక్ తెరకెక్కెబోతోందట. సీనియర్ నటి రేవతి ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేస్తోంటే, మరో సీనియర్ నటి సుహాసిని మణిరత్నం డైలాగ్స్ రాస్తోందట. క్వీన్‌గా కంగనా చేసిన పెర్ఫార్మెన్స్ మర్చిపోలేనిది. మరి ఇప్పటివరకూ కేవలం గ్లామర్ రోల్స్ చేసిన కాజల్.. ‘క్వీన్’ లాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్లో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

 
 
Related News