AP and TS / Entertainment
కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం షురూ!
22 days ago

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మొదటి షాట్‌కు జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. హరికృష్ణ, క్రిష్, శ్యాం ప్రసాద్ రెడ్డి ఇతర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గిన్నారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘180’ మూవీ డైరెక్టర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘జై లవకుశ’కు నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం ‘ఎమ్మెల్యే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

అనంతరం కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర సమర్పకుడైన మహేష్ కోనేరు తన కుటుంబసభ్యుల్లో ఒకరని, రెండేళ్లుగా ఆయనతో తనకు పరిచయం వుందని చెప్పాడు. తను ఈ సినిమా చేయడానికి కారణాల్లో మహేష్ కూడా ఒకరని అన్నారు. ఈ మూవీతో ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా పరిచయం అవుతోందని, ఇది అందరినీ అలరించే చిత్రం అవుతుందని పేర్కొన్నారు. కాగా.. ఆగస్ట్ 5 నుంచి 7 వరకు ఫస్ట్ షెడ్యూల్ ఏర్కాడ్‌లో స్టార్ట్ అవుతుందని మహేష్ తెలిపారు. తర్వాత ఆగస్ట్‌ 15 నుండి సెప్టెంబర్‌ చివరి వారం వరకు సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుందని, వచ్చే ఏడాది మొదట్లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు.

 
 
Related News