Telangana / Politics
కేటీఆర్ మీద కేసీఆర్ జోకులు
8 days ago

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తనయుడు కేటీఆర్ గురించి ఛలోక్తులు వేసి నవ్వుల పువ్వులు పూయించారు.

ముందుగా మాట్లాడిన కేటీఆర్‌, సిరిసిల్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని సీఎంను కోరారు. దానిపై కేసీఆర్‌ స్పందిస్తూ.. 'రామారావు బాగా హుషారయ్యారు. సిరిసిల్ల నీళ్లు బాగా వంటబట్టాయి. అప్పుడు సిరిసిల్లను జిల్లా చేస్తే చాలని అన్నాడు. ఇప్పుడేమో రూ.250-300 కోట్లు అడుగుతున్నాడు’ అంటూ చిన్నకథ చెప్పడంతో అందరూ నవ్వేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary