World / Crime
6 గంటలు నరకం చూపారు
131 days ago

కేరళలో ర్యాగింగ్ వికృత రూపం దాల్చింది. ఓ జూనియర్ విద్యార్థికి 8 మంది సీనియర్ విద్యార్థులు నరకం చూపారు. 6 గంటలపాటు చిత్రహింసలు పెట్టారు. పుషప్స్ చేయించడమే కాక..హానికరమైన పౌడర్ కలిపిన మద్యాన్ని బలవంతంగా తాగించడంతో అతని కిడ్నీ దెబ్బ తిన్నట్టు తెలిసింది. త్రిచూర్ లోని ఆసుపత్రిలో బాధితునికి డయాలిసిస్ చికిత్స చేయవలసిన అవసరం ఏర్పడింది.

కొట్టాయం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ర్యాగింగ్ పేరిట నరకం చూపిన సీనియర్ స్టూడెంట్స్ 8 మంది పరారీలో ఉన్నారు. వారిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేయగా.. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర మాజీ సీఎం ఊమెన్ చాందీ బాధితుడ్ని ఆసుపత్రిలో పరామర్శించారు. అతని వైద్య చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన కోరారు.


 

 
 
 
Related News

JournalistDiary