India / Crime
ఆ స్వామీజీ అలాంటోడు కాదట
120 days ago

తనను పలుమార్లు రేప్ చేశాడంటూ కేరళలో ఓ స్వామీజీపై ఆరోపణలు గుప్పించిన 23 ఏళ్ళ బాధితురాలు మాట మార్చింది. స్వామి గణేశానంద అలియాస్ హరి అనే ఆ స్వామీజీ తనపై అత్యాచారం చేయలేదని ఆమె అంటోంది. అయితే తాను చేసిన ఫిర్యాదు వెర్షన్ మార్చి పోలీసులు తమ స్టయిల్ లో బలవంతంగా లేఖ రాయించారని ఓ లెటర్లో పేర్కొంది. తనపై అత్యాచారం చేసినందుకు కొల్లం లో పన్మన ఆశ్రమానికి చెందిన ఆ స్వామీజీ జననాంగాన్ని కోసివేసిన ఈ బాధితురాలి సాహసాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ సహా అనేకమంది పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే తనమీద స్వామి గణేశానంద దారుణానికి పాల్పడలేదని, తన పట్ల లైంగిక వేధింపులకు దిగలేదని ఆమె తెలిపింది. నేను మైనర్ గా ఉన్నప్పుడు గానీ, నాకు 18 ఏళ్ళ వయస్సు వచ్చాక గానీ అలా జరగలేదు. ఆయన రేప్ చేశాడనడం సరి కాదు. అని ఆమె ఆ స్వామీజీ తరఫు లాయర్ కు పంపిన లేఖలో పేర్కొంది. అయితే ఇదే సమయంలో తనకు మళయాళ భాష రాదనీ, పోలీసులు ఒత్తిడి తెచ్చి తన చేత ఇలా రాయించారని ఆరోపించింది. దీన్ని డిఫెన్స్ లాయర్ కోర్టుకు సమర్పించ నున్నారు. వచ్చే సోమవారం తిరువనంతపురంలోని స్థానిక కోర్టు దీనిపై విచారణ జరపనుంది. ఇదిలా ఉండగా, ఈమెకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు తమను అనుమతించాలని పోలీసులు కోర్టును కోరే యోచనలో ఉన్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary