AP and TS / Entertainment
రాజకీయాలు కుళ్లిపోయాయి- కొరటాల శివ
14 days ago

డైరెక్టర్ కొరటాల శివ మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. ప్రస్తుత రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా కుళ్లిపోయాయని, దేవుడు
కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడు తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. మనం మాత్రమే వీటిని సరైన దారిలోకి
తీసుకురాగలమని సూచించాడు కొరటాల. సరిగ్గా డైరెక్టర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చ మొదలైంది.


కొరటాల ప్రస్తుతం మహేష్‌బాబుతో రాజకీయ నేపథ్యంతో కూడిన ‘భరత్ అనే నేను’ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇందులో ప్రిన్స్
సీఎం రోల్ పోషిస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ మూవీని డైలాగ్‌ని ట్వీట్ చేశాడని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం కొత్త మూవీని ప్రమోట్ చేస్తున్నాడంటూ ఒపీనియన్ వ్యక్తంచేస్తున్నారు.

 
 
Related News