AP and TS / Entertainment
క్రిష్ ఎందుకు ఫెయిలయ్యాడు..?
50 days ago

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని బాలీవుడ్‌లో మార్కెట్ చేసుకోవడంలో దర్శకుడు క్రిష్ ఎందుకు ఫెయిలయ్యాడు..? అక్షయ్ కుమార్‌తో ‘ఠాగూర్’ సినిమా రీ-మేక్ చేసిన క్రిష్.. తన ఈ తాజా చిత్రాన్ని మాత్రం హిందీలో మార్కెట్ చేసుకోలేకపోయాడు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి అక్కడా సక్సెస్ అయ్యాడు.

అయితే ఆయనకన్నా మంచి పట్టు ఉన్న క్రిష్.. ఈ విషయంలో వెనుకబడడానికి కారణం ముఖ్యంగా థియేటర్ల సమస్యేనని తెలుస్తోంది. రాజమౌళికి ఎదురు కాని ఈ సమస్య క్రిష్‌కి ఎదురైంది. బహుశా దీనివల్లే ఈ దర్శకుడు ఈ విషయంలో సఫలీకృతం కాలేకపోయాడని తెలుస్తోంది. ‘శాతకర్ణి’ మూవీని కేవలం 79 రోజుల్లో ముగించాలన్న గట్టి పట్టు కూడా క్రిష్ ఫెయిల్యూర్‌కి కారణమని తెలుస్తోంది.

 

 
 
 
Related News

JournalistDiary