AP and TS / Entertainment
ఇది బాలయ్య 99 చిత్రాల అనుభవం
286 days ago

గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య 99 చిత్రాల అనుభవమని అన్నాడు ఈ సినిమా డైరెక్టర్ క్రిష్. బాలకృష్ణ తన ఇన్ని చిత్రాల అనుభవాన్ని రంగరించి ఈ వందో సినిమా.. శాతకర్ణి  చేశాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రెండు నెలల పాటు స్క్రిప్ట్ పై వర్కౌట్ చేసి బాలయ్యను కలిశానని, ఆయన కథలో చాలా ఇన్వాల్వ్ అయ్యారని తెలిపాడు. 

మొరాకోలో ఈ చిత్రం  చేస్తున్నప్పుడు బాలకృష్ణ గుర్రపు స్వారీ ప్రతిభను చూసి అక్కడి ట్రైనర్ ఆశ్చర్యపోయారని,  బాలయ్య ఎక్కడా డూప్ లను చేయనివ్వలేదని క్రిష్ చెప్పాడు. ఇక బాహుబలి సినిమాతో దీన్ని ఎవరూ పోల్చరు. అది ఫాంటసీ సినిమా అయితే మాది చారిత్రిక సినిమా అన్నాడు. 

కన్నన్ అనే మిత్రుడి నుంచి, మహారాష్ట్ర గెజిట్ నుంచి, మెకంజీ, మెగస్తనీస్ రాతల నుంచి శాతకర్ణి రాజు చారిత్రిక ప్రాధాన్యాన్ని తెలుసుకున్నట్టు వెల్లడించాడు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి..ఎక్కువగా గ్రాఫిక్స్ మీద ఆధారపడవద్దని సలహాఇచ్చినట్టు క్రిష్ పేర్కొన్నాడు. ఆయన సలహాను బట్టి ఈ సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్స్ జోలికి వెళ్ళలేదన్నాడు. సబ్-టైటిల్స్ ఉంటాయి గనుకే ఈ సినిమాను ఇతర భాషల్లో తీయలేదన్నాడు.

 

Read Also

 
Related News
JournalistDiary