India / Politics
ఆత్మరక్షణ కోసమే చేశా..!
958 days ago

పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా సభలో సభ్యులపై దాడి జరుగుతున్నప్పుడు ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వినియోగించానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు. సభలో గొడవ జరుగుతున్నప్పుడు ఏమి జరిగిందో ఫుటేజ్ చూస్తే తెలుస్తుందని అన్నారు. ఎవరిది తప్పో ఒప్పో చూస్తే తెలుస్తుందని మీడియాతో అన్నారు.

పెప్పర్ స్ప్రేని కేవలం మహిళలేకాదు ఎవరైనా వాడవచ్చని, ఒకరిపై దాడి జరుగుతుంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి‌ని ఎంపీలు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే కాపాడేందుకు వెళ్లానని, అదేసమయంలో తనపై కూడా దాడి జరగడంతో ఆత్మరక్షణ కోసమే స్ప్రేని ఉపయోగించినట్లు తెలియజేశారు.  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారైందని, విభజన అంశంపై సొంతమంత్రులతో చర్చించిన సందర్భాలు లేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ డబుల్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. 


 
 
 
Related News

Jyo achyutanand 308X300 banner