India / General
ఫిట్‌‌‌నెస్ కోసం చెమటోడుస్తున్నారు
61 days ago

ఓ వైపు నిరంతరం రాజకీయాల్లో తల మునకలవుతూనే మరో వైపు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఎప్పటికప్పుడు బాడీ మెయింటెనెన్స్ చేయడం సాధ్యమేనా..? సాధ్యమేనంటున్నారు నేతలు.

ఏపీ సీఎంచంద్రబాబు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ,..ఇలా చాలామంది రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన.. ఫిట్‌‌నెస్ కోసం కష్టపడకూడదా అని ప్రశ్నిస్తున్నారు.

68 ఏళ్ళ వయస్సులోనూ చంద్రబాబు ఇంకా సైకిల్ తొక్కుతూ, యోగాసనాలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ రోజూ జిమ్ లో సుమారు రెండు గంటలపాటు ఎక్సర్ సైజ్ చేస్తారట.

యోగి ఆదిత్యనాథ్ బాబా రాం దేవ్ తో కలిసి యోగా చేస్తే... టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేటికీ బస్కీలు తీస్తుంటారు. ఉదయంపూట రెగ్యులర్ వాకింగ్ ఆయనకు అలవాటు. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నారు.

ఇక రాహుల్ సైతం తనకు తీరిక దొరికినప్పుడల్లా సైకిల్ తోక్కడమే కాదు.. జాగింగ్, వాకింగ్, తరచూ వంద కేజీల బరువున్న పిండి బస్తాలు కూడా మోస్తూ తన బాడీ ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్నారు. ఈనెల 21 న యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ యోగాసనాలు వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజును యోగా దినోత్సవంగా పాటించడం విశేషం.

 

 

Read Also

 
Related News