AP and TS / Entertainment
నా టైమ్ మొదలైంది: మెహరీన్
22 days ago

మరో రెండు రోజుల్లో తన సినిమా రిలీజ్ అవుతున్న వేళ మహానుభావుడు సినిమా హీరోయిన్ మెహరీన్ కౌర్ మీడియాతో ముచ్చటించింది. తాజా సినిమా గురించి.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, ఇతర హీరోల గురించి తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ తో నటిగా పరిచయమైన మెహరీన్ కౌర్, తన లేటెస్ట్ మూవీ రిలీజ్ పట్ల ఎలాంటి టెంక్షన్ లేదంది. ‘మహానుభావుడు’ సినిమా ఒక స్వీట్ లవ్ స్టోరీ అని చెప్పింది. ఈ సినిమాలో తన పాత్ర పేరు మేఘన. విలేజ్ నుండి వచ్చి ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటా.. నా క్యారెక్టర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని వెల్లడించింది.

డైరెక్టర్ మారుతిగారు స్క్రిప్ట్ చెప్పగానే చాలా ఎగ్జైట్ ఫీలయ్యానని, వెంటనే ఒప్పేసుకున్నానని మెహరీన్ తెలిపింది. మారుతి లాంటి డైరెక్టర్, యూవీ క్రియేషన్స్ లాంటి గొప్ప బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీ అంది. ఓసీడీ కాకుండా మహానుభావుడు సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయని, తమ ఇద్దరి మధ్య మంచి లవ్ స్టోరీ ఉంటుందని పేర్కొంది. తెలుగులో రెండవ సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టిందని అయితే, ఇదంతా తనమంచికేనని, ఇప్పుడు నా టైమ్ మొదలైందని మెహరీన్ చెప్పింది. తెలుగులో ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తనవి వరుస సినిమాలు రిలీజవుతున్నాయని చెప్పింది.

ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని, ఇప్పటి వరకూ తాను ఏ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోలేదని, అవి వర్కవుట్ కాలేదంతేనని కొన్ని ప్రాజెక్ట్ లు వదులుకున్నారన్న దానిపై క్లారిటీ ఇచ్చింది మెహరీన్. శర్వానంద్ చాలా మంచివాడని, ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటాడని తెలిపింది. ‘రాజా ది గ్రేట్’ సినిమాకోసం రవితేజతో కలిసి చేస్తున్నానని, ఆయనకు రీస్టార్ట్ బటన్ ఉంటుందని, ప్రతి సినిమాకీ రీచార్జ్ అవుతూ, కొత్త నటుడిలా కనిపిస్తుంటారని మెహరీన్ వెల్లడించింది.

 

Read Also

 
Related News
JournalistDiary